బోధన్ మండలం ఉట్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎంబెల్లి శంకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారి సేవలు మరువలేనివని వారి జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.