బోధన్ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే వారాంతపు సంతలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో వాటి ధరలకు డిమాండ్ పెరుగుతున్నాయి. కూరగాయల ధరలు తగ్గించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కూరగాయలు కొనడానికి వెళ్తే వాటి ధరలు వింటేనే బయమేస్తోంది అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారని ప్రజలు వాపోతున్నారు. అయిన కొనడం మాత్రం తగ్గడం లేదు. అధికారులు స్పందించి కూరగాయల ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు.