సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు ల వర్ధంతి సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ ఆదివారం భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురుల బాటలో నడవడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు. వారి ఆశయాల కోసం యువత కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల ఆంజనేయులు, దేవేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.