బోధన్ మారుతి మందిరంలో ఉగాది వేడుకలు

63చూసినవారు
బోధన్ మారుతి మందిరంలో ఉగాది వేడుకలు
బోధన్ పట్టణంలోని మారుతి మందిరంలో మంగళవారం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. క్రోధి నామ సంవత్సరం అందరికీ అనుకూలించాలని పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్, ఈఓ రవీందర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ రాములు, హనుమాన్ దీక్షా సేవా సమితి సభ్యుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.