కూలిన ఇండ్ల బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్

58చూసినవారు
కూలిన ఇండ్ల బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్
ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్ లోని నిజాంసాగర్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో ఇల్లు కూలిపోయిన విషయం పాఠకులకు విదితమే. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదివారం దెబ్బతిన్న, కూలిన ఇళ్లను పరిశీలించారు. మండలంలోని సుల్తాన్ నగర్, వడ్డేపల్లి పలు ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్