కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లి గ్రామ పరిసరాల్లో గురువారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. తవ్వకాలు చేసిన చోట క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాలు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఉదయం వెంటనే గ్రామస్తులు గుప్తనిధుల తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ గ్రామ పరిధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయగా గ్రామస్తులు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.