సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి, సమానత్వానికి పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి ప్రభుత్వానికి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పూలే దంపతుల సేవలు త్యాగాలను గుర్తు చేసుకున్నారు.