ఇండల్వాయి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి

82చూసినవారు
ఇండల్వాయి గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి
ఇండల్వాయి గ్రామంలో గురువారం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జననం తప్ప మరణం లేని ఏకైక వీరుడు మన సుభాష్ చంద్రబోస్ అలాంటి మహనీయుడు వేడుకలు ప్రతి సంవత్సరం జరపడం చాలా సంతోషంగా ఉందని గ్రామ యువత తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్