నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో బతుకమ్మ సంబరాలు శనివారం సాయత్రం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఉయ్యాలో రామ ఉయ్యాలో.. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అంటూ స్వయంగా మహిళలు పాడుతూ బతుకమ్మ చుట్టూ అడి పాడారు. ర్యాలీగా వాగు వద్ద బతుకమ్మను నిమర్జనం చేసి ఒకరి కొకరు ప్రసాదం పంచుకున్నారు.