మోస్రా మండల కేంద్రానికి చెందిన శారద (20) అనే మహిళకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంభీకులు 108కు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలోనే ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని జిల్లా ఆసుపత్రి కి తరలించినట్లు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ లలిత తెలిపారు.