చందూర్ మండల కేంద్రంలో పలు సార్లు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తిరుగుతున్నారని గ్రామస్తులు తెలిపారు. శ్రీ విగ్నేశ్వర కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిన ఘటన చోటు చేసుకున్నదని, సోమవారం ఒంటి గంట ప్రాంతంలో వీధుల్లో ఓ మహిళ తిరుగుతున్నదని గుర్తించిన కాలనీ వాసులు ఆమెను హెచ్చరించినట్లు తెలిపారు. పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.