నిజామాబాద్ జిల్లా సుభాష్‌నగర్ బాల్ రక్ష భవనంలో మంగళవారం 3 నెలల పసికందు మృతి చెందింది. గుర్తు తెలియని ఓ మహిళ సెప్టెంబర్ 15న జిల్లా ఆస్పత్రిలో పసికందుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయింది. గమనించిన వైద్యులు శిశువును శిశు గృహానికి తరలించి చికిత్స అందించారు. కాగా శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది.