మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఓ వ్యక్తి మురికి కాలువలో పడి మృతి చెందినట్లు నిజామాబాదుని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో న్యాల్కల్ రోడ్డు ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.