ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గురువారం తెలిపారు.