నిజామాబాద్ లో పొట్టేలు సినిమా యూనిట్ సందడి

69చూసినవారు
నిజామాబాద్ లో పొట్టేలు సినిమా యూనిట్ సందడి
నిజామాబాద్ నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో యువచంద్ర, హీరోయిన్ అనన్య నాగళ్ల కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తమ సినిమాను ఆదరించాలని, అందరికీ నచ్చే విధంగా సినిమాను రూపొందించారని హీరో హీరోయిన్లు అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, నటీనటులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్