నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాల్టెక్నిక్ ఏరియాలో గల ఓ ఆలయం వద్ద చెట్ల కొమ్మలపై నిత్యం సాయంత్రం అయ్యిందంటే చాలు రామ చిలుకలు సందడి చేస్తుంటాయి. కొత్తగా చూసే వారు వేల సంఖ్యలో చిలుకలను వింతగా చూస్తూ ఆనందిస్తారు. చెట్టు పక్కన ఉన్న స్థానికులు కెవ్వు కెవ్వు అనే శబ్దాలకు ఇబ్బంది అయినప్పటికీ ఆనందాన్ని కలుగజేస్తాయని అంటున్నారు.