కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిపిన భేటీలో కేవలం కుల గణన, ఎస్సీ వర్గీకరణపై మాత్రమే చర్చించానని, కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యకర్గ కూర్పుపై ఎలాంటి డిస్కషన్ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని CM స్పష్టం చేశారు. కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని, ఉప ఎన్నికలు వస్తాయో రావో కేటీఆరే చెప్పేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.