NDAతో చేతులు కలిపే ప్రసక్తే లేదు: ఉద్దవ్

70చూసినవారు
NDAతో చేతులు కలిపే ప్రసక్తే లేదు: ఉద్దవ్
ఎన్డీఏ కూటమితో చేతులు కలిపే ప్రసక్తే లేదని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో తాము చేరబోతున్నామని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. కాగా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 30 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 13, శివసేన-యూబీటీ 9, ఎన్సీపీ-శరద్ 8 స్థానాల్లో గెలిచాయి.

సంబంధిత పోస్ట్