కేదార్‌నాథ్ ప్రాంతం నుంచి హిందూ యేతరులను బహిష్కరించాలంటూ ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌతియాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. అక్కడ నివసిస్తున్న హిందూ యేతరులు మాంసం, మద్యం విక్రయిస్తూ స్థానికుల మనోభావాలను గాయపరిచే చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇలా చేయడం హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయడమే అవుతుందని కేదార్‌నాథ్ శాసనసభ్యురాలైన నౌతియాల్ చెప్పారు.