తాను నటించనున్న మరో క్రేజీ ప్రాజెక్టు గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. "నాగవంశీ నిర్మాతగా నేను ఓ సినిమాలో నటించనున్నా. ఆయనే ఆ చిత్రాన్ని ప్రకటిస్తారు. ఆ మూవీ ప్రారంభమైన రోజు మీ అందరినీ హ్యాండిల్ చేసే బాధ్యత ఆయనకే అప్పగించబోతున్నా. ఆ రోజు మీరు పొగడాలన్నా, తిట్టాలన్నా వంశీనే ఇన్‌ఛార్జి" అని పేర్కొన్నారు. ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.