స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్
రాజమౌళి బర్త్ డే సందర్భంగా జూనియర్
ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే జక్కన్న.. అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షూటింగ్ స్పాట్ లో రాజమౌళితో కలిసి ఉన్న ఫొటోను జూనియర్
ఎన్టీఆర్ తన ట్వీట్ కు జతచేశారు. దీంతో వీరి మధ్య బాండ్ ని ఎవరూ దూరం చేయలేరంటూ
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీరి కాంబినేషన్ లో వచ్చిన
ఆర్ఆర్ఆర్ మూవీ
ఆస్కార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.