కేంద్ర ప్రభుత్వం సీఏఏను దేశవ్యాప్తంగా ఏ రోజున అమల్లోకి తీసుకొచ్చింది?

79చూసినవారు
కేంద్ర ప్రభుత్వం సీఏఏను దేశవ్యాప్తంగా ఏ రోజున అమల్లోకి తీసుకొచ్చింది?
పౌరసత్వ (సవరణ) చట్టం - 2019 (సీఏఏ - సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం 2024, మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కల్పిస్తున్న తొలి చట్టం ఇది. 2014, డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఈ చట్టం ప్రకారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు.

సంబంధిత పోస్ట్