ఏపీ పునర్‌విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ.. మూడు అంశాలపై అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, విద్యుత్ బకాయిల అంశంపై పంచాయితీ మాత్రం ఎటూ తేలలేదు. రూ.861 కోట్ల మేర లేబర్ సెస్‌ను ఏపీ - తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల అంశమూ తేలలేదు.