3 నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి: హరీష్ రావు

58చూసినవారు
3 నెలల పెండింగ్ జీతాలు చెల్లించండి: హరీష్ రావు
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) ‌ఉద్యోగులకు తక్షణమే మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వీరికి పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్