మంథని: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్ కి సన్మానం

61చూసినవారు
మంథని: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్ కి సన్మానం
శనివారం కాకర్లపల్లిలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గ్రామ అంగన్వాడి టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గాదే మల్లక్కను కాకర్లపల్లి కాంగ్రెస్ కార్యకర్త మెండే రాజయ్య శాలువాతో సన్మానించారు. రాజయ్య మాట్లాడుతూ శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువని, ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్