రామగుండం: ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేసిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ

85చూసినవారు
రామగుండం: ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేసిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ
రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో గురువారం ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటుచేసిన సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ 2025 పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ముఖ్యంగా బాల బాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితంలో 10వ తరగతి వార్షిక పరీక్ష కీలకమని అన్నారు.

సంబంధిత పోస్ట్