రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని పెద్దపెల్లిపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఎన్టీపీసీ, బసంతనగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్ సిఎల్, సింగరేణి ఉన్నాయని వివరించారు.