Top 10 viral news 🔥
ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: మంత్రి
TG: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, దీనిపై ఎవరూ సందేహపడనవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయదని, ఒకదాని తర్వాత ఒకటిగా హామీలకు కార్యరూపం ఇస్తామని వెల్లడించారు. సోమవారం నాడు ఆర్టీసీ కళాభవన్లో మీ-సేవ 14వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.