జగిత్యాల
జగిత్యాల: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మమతను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సైదులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక విద్యార్థులు పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు రెండు రోజుల క్రితం ప్రిన్సిపల్ కు వ్యక్తిగతంగా జరిగిన గొడవపై ఆర్సివో అంజలి విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేశారు.