మామిడి చెట్లలో కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు రైతులు, కాయలపై నల్లని బంక కారడం, నల్లని మచ్చలు గమనిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. పురుగుల ఉనికిని గమనించిన వెంటనే క్లోరిపైరిఫాస్ (2.5ml లీటరు నీటికి) మరియు వేపమందు 10000 పీపీఎం (1ml లీటరు నీటికి) కలిపి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పురుగు ఆశించిన చెట్ల కింద రాలిన కాయలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చేయాలి.