మామిడిలో కాయతొలుచు పురుగు నష్టం చేసే విధానం

77చూసినవారు
మామిడిలో కాయతొలుచు పురుగు నష్టం చేసే విధానం
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మామిడిలో కొత్త చీడల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే, మామిడిలో కాయతొలుచు పురుగు కాయలకు బాగా నష్టం చేస్తోంది. మామిడి పిందెలు ఎదిగే దశలో తల్లి రెక్క పురుగులు కాయల తొడిమల చుట్టూ, రెండు కాయలు జంటగా ఉన్నచోట్ల గుడ్లు పెడతాయి. 2-3 రోజులలో గుడ్ల నుంచి గొంగళి పురుగులు బయటకు వచ్చి కాయల తొక్క పైపొరను గోక్కి చప్పరిస్తాయి. దీనివల్ల కాయలపై నల్లమచ్చలు ఏర్పడి నల్లగా బంక కారుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్