TG: ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం నేతలు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానిపై మద్యాహ్నం 2.30కి కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, నిన్న చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే వారి మృతిపై అనుమానాలున్నాయని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.