గోవాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

59చూసినవారు
గోవాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
పెట్రోల్, డీజిల్‌లపై గోవా ప్రభుత్వం వ్యాట్ పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూపాయి, లీటర్ డీజిల్‌పై 36 పైసలు వ్యాట్ పెంచుతున్నామని, శనివారం నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ అండర్ సెక్రటరీ ప్రణబ్ బీ భట్ తెలిపారు. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ రూ.95.40, లీటర్ డీజిల్ రూ.87.90లకు లభిస్తుంది. దీనిపై గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత యురి అలెమావో స్పందిస్తూ.. తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్