ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా.మంకోజెబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి 15రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు: ఈ తెగులు నివారణ కోసం లీటర్ నీటిలో 3గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి, తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.
తుప్పు తెగులు: ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 2గ్రా. మాకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.