ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం LSGతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రభ్‌సిమ్రాన్ మెరుపు ఇన్నింగ్ ఆడారు. పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేశారు.