పార్లమెంటు సమావేశంలో భాగంగా బుధవారం లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. దీనితో, కేంద్ర ప్రభుత్వం NTA కూటమి ఎంపీలందరికీ సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన ఎంపీలకు సైతం విప్ జారీ చేసింది. వారు లోక్‌సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించింది.లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 233 మంది ఎంపీలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.