AP: విశాఖలోని మధురవాడలో నిండు గర్భిణీ అనూష (27) హత్య కేసులో ఆమె భర్త గెద్దాడ జ్ఞానేశ్వర్ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లికి ముందే శారీరకంగా కలిసేందుకు యత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించేవాడు. ఒకసారి ఫలూదాలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. గ్లాసులో మాత్రలు కరగకపోవడంతో ఆమె ఏంటని ప్రశ్నించగా.. తనకు తెలియదని బుకాయించాడు.