ప్ర‌ధాని మోదీకి కంగ్రాట్స్ చెప్పిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

81చూసినవారు
ప్ర‌ధాని మోదీకి కంగ్రాట్స్ చెప్పిన ఉక్రెయిన్ అధ్య‌క్షుడు
ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో సాధార‌ణ ఎన్నిక‌ల‌ను స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించ‌డం ప‌ట్ల స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి వ‌రుస‌గా మూడ‌వ‌సారి విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోదీకి ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. శాంతి, సౌభాత్రుత్వంలో భార‌త ప్ర‌జ‌లు వ‌ర్ధిల్లాల‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్