మురుగు వ్యర్థాలను నీటి వనరుల్లోకి విడుదల చేయడానికి ముందు వాటిని శుద్ధి చేయాలి. ఆధునిక పద్ధతుల ద్వారా మురుగునీటిని శుభ్రపరిచి, అవసరమైన చోట వినియోగించాలి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలి. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించి వాటికి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలి. నీటి వనరుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, హానికరమైన లోహ వ్యర్థాలు, మృతకళేబరాలు కలపకుండా చర్యలు తీసుకోవాలి.