తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి గాయాలు

69చూసినవారు
తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. నలుగురికి గాయాలు
AP: తిరుమల మొదట ఘాట్‌ రోడ్డులో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌రోడ్డు చివరి మలుపు వద్ద డివైడర్‌ను ప్రమాదవశాత్తు టీటీడీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. టీటీడీ వాహనంలో దాదాపు 20మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్