IPL-2025లో భాగంగా లక్నో వేదికగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కు హోమ్ గ్రౌండ్ అనుకూలత కలిసి వచ్చే అంశం. ఇరు జట్లూ రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాయి.