అడవిలో సఫారీకి వెళ్లిన పర్యాటకుల కెమెరాకు ఓ షాకింగ్ దృశ్యం చిక్కింది. ఒక ఎత్తైన చెట్టు కొమ్మ చివరన ఒక డేగ కూర్చుని అటు, ఇటు చూస్తుంటుంది. అయితే, ఆ సమయంలో ఎలుగుబంటి చెట్టుపైకి ఎక్కుతుంది. ఆ విషయాన్ని డేగ గమనించలేదు. దీంతో క్షణంలో చెట్టుపై నుంచి డేగ మెడ పట్టుకుని కిందకి దూకుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.