ఏప్రిల్ 15 వరకు వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

77చూసినవారు
ఏప్రిల్ 15 వరకు వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు
AP: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 15 వరకు వంశీకి విజయవాడ ఏజేఎఫ్‌సీఎం కోర్టు రిమాండ్ పొడిగించింది. తమ భూమిని అక్రమంగా తీసుకున్నారన్న ఆరోపణలపై ఆత్కూరు PSలో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల పోలీస్ కస్టడీకి పంపారు. కాగా వంశీ పలు కేసుల నేపథ్యంలో విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్