ఢిల్లీ ఘటనపై ప్రధాని స్పందన

62చూసినవారు
ఢిల్లీ ఘటనపై ప్రధాని స్పందన
ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీ కేర్ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిన్నారులు చనిపోవటం మనసును కలిచివేసిందని అన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్