బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్

61చూసినవారు
బీజేపీపై ప్రియాంకా గాంధీ ఫైర్
బీజేపీ పార్టీ మొత్తం రాహుల్ గాంధీపై అసత్య ప్రచారం చేయడంలో నిమగ్నమైందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటోందని ఎప్పుడో స్పష్టమైందని తెలిపారు. కానీ ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వస్తుందని గ్రహించిన ప్రధాని మోదీ మాటమార్చారని విమర్శించారు. బీజేపీ మతం, కులం, గుడి-మసీదు గురించి మాత్రమే మాట్లాడుతోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్