పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే, కొన్ని చోట్ల స్క్రీనింగ్‌కు అంతరాయం కలిగింది. తాజాగా మహారాష్ట్ర బాంద్రాలోని గెలాక్సీ థియేటర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. కెమికల్ స్ప్రే చేయడంతో షో అర్ధాంతరంగా ఆగిపోయింది. థియేటర్‌లో ఆ వ్యక్తి స్ప్రే చేసిన గుర్తుతెలియని కెమికల్ వల్ల ప్రేక్షకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమందికి దగ్గు, గొంతు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు.