క్విట్ ఇండియా తీర్మానం.. అరెస్టయిన నాయకులు

64చూసినవారు
క్విట్ ఇండియా తీర్మానం.. అరెస్టయిన నాయకులు
క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పాట్నాలో అరెస్టయ్యారు.

సంబంధిత పోస్ట్