ఆంగ్ల నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాలే యాదయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.