ఫారుక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలు గురువారం సిద్ధం చేశారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ వంటి వసతులు కల్పించడంతో పాటు పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.