చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్‏లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

51చూసినవారు
చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్‏లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
పెద్ద అంబర్‏పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలోని చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మంగళవారం నిర్వహించారు. శాంతినగర్, సంతోష్ నగర్ ప్రాంతాల వృద్ధులకు నిత్యావసర సరుకులు కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి ద్వారా పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఛైర్మన్ మల్కన్న మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థకు మూలాధారం వృద్ధులేనని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరం చేయకుండా వారి బాగోగులు చూసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్